రేపు అర్జీలను స్వీకరించనున్న ఎమ్మెల్యే
TPT: గూడూరు ఎమ్మెల్యే పి.సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ శుక్రవారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు గూడూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ వినతులు స్వీకరించనున్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయాలని, ఆధార్ కార్డు జిరాక్స్ కూడా జత చేసి తీసుకు రావాలని MLA కార్యాలయ ప్రతినిధులు కోరారు.