'రీ సర్వేలో జరిగిన అవకతవకలను సరిచేయాలి'
AKP: కశింకోట మండలంలో రీసర్వేలో జరిగిన భూముల అవకతవకలను సరిచేయాలని మండల సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఉగ్గినపాలెం సర్పంచ్ గున్నయ్య నాయుడు మాట్లాడుతూ.. సాగులో ఉన్న వారి పేర్లు నమోదు చేయకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నట్లు తెలిపారు.