మత్తు పదార్థాలపై ఉపాధ్యాయుడు అవగాహన

మత్తు  పదార్థాలపై ఉపాధ్యాయుడు అవగాహన

SRPT: మత్తు రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ వినూత్న ప్రచారం చేపట్టారు. గురువారం కుప్పిరెడ్డిగూడెం, కుసుమవారిగూడెం పొలాల్లో వరి నాట్లు వేస్తున్న రైతులకు, కూలీలకు గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. విచిత్ర వేషధారణతో గళమెత్తి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా రైతులు ఆయనను అభినందించారు.