'జాతీయ రహదారి పనులు పూర్తి చేయాలి'
PLD: జాతీయ రహదారి 167AG పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కాంట్రాక్టరుకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో పనుల పురోగతిని పరిశీలించారు. పిడుగురాళ్ల - సత్తెనపల్లి - పేరేచర్ల రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.