రాష్ట్ర చెస్ పోటీల్లో జగన్నాథపురం విద్యార్థిని ప్రతిభ
W.G: తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం జడ్పీ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని చేదూరి పోసి రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించింది. ఈ విషయాన్ని ఎస్ఎంసీ ఛైర్మన్ అరిగెల వెంకటకృష్ణ సోమవారం తెలిపారు. బాలిక విజయానికి కృషి చేసిన పీడీ వెంకటేశ్వరరావును ఆయన అభినందించారు. విద్యార్థిని మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు