అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటాం: డీకే
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అనంతరం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రజలు తమను నమ్మి అధికారం ఇచ్చారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.