మారుమూల ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల బలోపేతానికి కలెక్టర్ పిలుపు
ASF: జిల్లా కలెక్టరేట్‌లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు గోడ ప్రతులను ఆవిష్కరించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో సౌకర్యాలు పెంచుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.