వ్యక్తి అనుమానాస్పద మృతి.. కుటుంబం నిరసన

వ్యక్తి అనుమానాస్పద మృతి.. కుటుంబం నిరసన

కృష్ణా: గన్నవరంలో నాగరాజు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో ఉద్రిక్తతలు నెలకొంది. పురుగుల మందు తాగి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు మరణించాడు. దీనికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తు, గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిరసన తెలుపుతు, రోడ్డుపై బైఠాయించారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే నాగరాజు ప్రాణాలు దక్కేవని అతని భార్య ఆవేదన వ్యక్తం చేసింది.