'రిజర్వాయర్ పనులు ప్రారంభించండి'

KRNL: నగరడోణ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు ప్రారంభించి పూర్తి చేసి రైతులకు అంకితం చెయ్యాలని ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వర్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ కోరారు. నగరడోణ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు ప్రారంభించాలని కోరుతూ.. నీటిపారుదల శాఖ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు.