రేపటి నుంచి గ్రామసభలు ప్రారంభం
MLG: మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీలలో రేపటి నుంచి నిర్వహించనున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామసభల యాక్షన్ ప్లాన్ షెడ్యూల్‌ను మండల పరిషత్ అధికారి భద్రు, తహసీల్దార్ తోట రవీందర్ విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షతన జరిగే గ్రామసభలకు ఇంచార్జ్ అధికారులు పాల్గొని గ్రామాభివృద్ధి, సమస్యలపై చర్చించనున్నారు.