‘ఆపరేషన్ నైట్ సేఫ్టీ’ చేపట్టిన ఎస్పీ జగదీష్
ATP: జిల్లాలో రాత్రి భద్రతను పటిష్టం చేసేందుకు ఎస్పీ జగదీష్ స్వయంగా ‘ఆపరేషన్ నైట్ సేఫ్టీ’ చేపట్టారు. అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. డ్యూటీలో ఉన్న సిబ్బంది పనితీరును సమీక్షించి, ప్రజలు భయం లేకుండా సంచరించేలా భద్రత కల్పించాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు.