క్షయ వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి

క్షయ వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి

గుంటూరు జిల్లా: ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు క్షయ వ్యాధి నివారణ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. గోరంట్ల సమీపంలోని ప్రభుత్వ ఛాతి,సాంక్రామికవ్యాధుల వైద్యశాలలో వైద్య ఆరోగ్య శాఖ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ టీబీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని క్షయవ్యాధిపై ప్రజల్లో ర్యాలీ నిర్వహించారు.