పెనుకొండలో AISA ఆధ్వర్యంలో నిరసన

సత్యసాయి: పెనుకొండ మండలం అంబేద్కర్ సర్కిల్లో AISA ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. పెనుకొండ మండల AISA కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తూ, విద్యార్థుల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తూ జీవో నెంబర్ 3ను తీసుకురావడం జరిగిందన్నారు. విద్యార్థుల స్వేచ్ఛకు భంగం కలిగించే జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.