భీమేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.1.80 కోట్లు

భీమేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.1.80 కోట్లు

KMR: తాడ్వాయిలోని సంతాయిపేట్ భీమేశ్వరాలయ అభివృద్ధికి రూ.1.80 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ క్యాంపు కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. ఇటీవల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే కోరడంతో ఈ నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించినందుకు ప్రజలు, భక్తులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.