'అటవీ భూములు కబ్జా చేస్తే ఎవరినీ వదిలేది లేదు'

'అటవీ భూములు కబ్జా చేస్తే ఎవరినీ వదిలేది లేదు'

KMR: కందకాలు తవ్వి అటవీ భూములను ఆక్రమించకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా అటవీశాఖ అధికారిణి నిఖిత పేర్కొన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. వేసవిలో అడవులకు పొంచి ఉన్న ఆపద, కలప రక్షణ తదితర అంశాలపై పలు విషయాలు వెల్లడించారు. అటవీ భూములు కబ్జా చేస్తే ఎవరినీ వదిలేది లేదన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 1980.88 హెక్టార్ల అటవీ భూములను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.