VIDEO: రావు సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేయాలి: ఎంఆర్పీఎస్

VIDEO: రావు సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేయాలి: ఎంఆర్పీఎస్

PLD: రిజర్వేషన్లు, అట్రాసిటీ చట్టాన్ని రద్దు చేయాలన్న రావు సుబ్రహ్మణ్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం చిలకలూరిపేట టౌన్ సీఐకి ఫిర్యాదు చేశారు. దళితుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నగేష్ మాదిగ కోరారు. దీనిపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు.