విశాఖ బీచ్‌రోడ్డులో అమరవీరుల స్మృతిగా కొవ్వొత్తుల ర్యాలీ
VSP: విశాఖ బీచ్ రోడ్డులోని పాండురంగాపురం నుంచి పోలీసు మెస్ వద్ద ఉన్న అమరవీరుల స్మృతి స్థూపం వరకు శుక్రవారం రాత్రి పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్మృతి స్థూపం వద్ద సీపీశంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల వారోత్సవాలు శుక్రవారంతో ముగిసాయన్నారు.