పోలేపల్లి ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం
TG: మహబూబ్‌నగర్ జిల్లా పోలేపల్లి ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసినా స్పందన లేదని అధికారులపై మండిపడ్డారు. పరిశ్రమ వ్యర్థాలపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. సోమవారం సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా పోలేపల్లి గ్రామాన్ని ఆనుకొని ఉన్న భూములను డంపింగ్ యార్డులుగా మార్చడంతో స్థానికులు రోగాల పాలవుతున్నారు.