రేపటి నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం

రేపటి నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం

KRNL: క్లస్టర్ వర్సిటీ పరిధిలోని కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు రిజిస్ట్రార్ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. రేపటి నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 22, 24 తేదీల్లో ధ్రువ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.