విద్యుత్ షాక్‌తో పాడి గేదె మృతి

విద్యుత్ షాక్‌తో పాడి గేదె మృతి

NLG: కనగల్ మండలంలోని దోరెపల్లి గ్రామానికి చెందిన రైతు అయితగోని జానయ్య పాడి గేదె విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. గ్రామ సమీపంలోని వాగు ఒడ్డుకు గేదెను మేత కోసం తోలుకెల్లగా వాగు నీటిలో తెగి పడిన విద్యుత్ వైరు గేదకు అంటుకొని ప్రమాదం చోటు చేసుకుంది. రూ 60 వేల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. అధికారులు వివరాలు నమోదు చేసుకుని పంచనామా నిర్వహించారు.