సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన

సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన

కృష్ణా: తోట్లవల్లూరు Z.P హై స్కూల్ విద్యార్థులకు సైబర్ క్రైమ్, చైల్డ్ మ్యారేజ్, పోక్సో యాక్ట్ పై శక్తి టీం నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సోషల్ మీడియాలో అప్రమత్తత, అనధికార యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో తమ వ్యక్తిగత సమాచారం ఫోటోలు అప్‌లోడ్ చేయకూడదని సూచించారు.