మార్నింగ్ వాకర్స్ సమస్యలు తెలుసుకున్న మంత్రి

NLG: ఎన్జీ కళాశాల క్రీడా ప్రాంగణంలో మార్నింగ్ వాకింగ్, వ్యాయామం చేస్తున్న వాకర్స్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుసుకుని, వారి వసతులపై చర్చించారు. అనంతరం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.