VIDEO: చిరుత దాడిలో ఆవు మృతి

VIDEO: చిరుత దాడిలో ఆవు మృతి

SRCL: చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో చిరుతపులి దాడిలో ఆవు మృతి చెందింది. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేంద్రరావు కథనం ప్రకారం గ్రామానికి చెందిన లాండే సంతోష్ అనేరైతు రోజు మాదిరిగానే పొలం వద్ద ఆవును కట్టేసి ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం రైతు పొలం వద్దకు వెళ్లి చూడగా ఆవు కనబడలేదు. చుట్టుపక్కల వెతకగా ఆవు కళేబరంతో పాటు చిరుతపులి అడుగులను గుర్తించాడు.