పామూరు: యువత బెట్టింగ్ ఉచ్చులో పడొద్దు

ప్రకాశం: నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పామూరు మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం రామా నాయక్ యువతకు పలు కీలక సూచనలు చేశారు. యువత క్రికెట్ బెట్టింగ్ ఉచ్చులో పడవద్దని అన్నారు. అలాగే మండలంలో ఎవరైనా బెట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని క్రికెట్ బెట్టింగ్ వ్యసనంగా మారకూడదని అన్నారు.