హైదరాబాద్‌లో కల్తీ ఫుడ్ మాఫియా బట్టబయలు

హైదరాబాద్‌లో కల్తీ ఫుడ్ మాఫియా బట్టబయలు

HYD: నగరంలో రోజురోజుకు కల్తీ తయారీదారులు పెరిగిపోతున్నారు. కాగా, అంబర్ పేటలో ఓ బిస్కెట్ తయారీ ఫ్యాక్టరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో అబ్బురపరిచే విషయాలు బయటకు వచ్చాయి. బిస్కెట్ తయారీలో ప్రమాదకర రసాయనాలు, రంగులు, కెమికల్స్, నాసిరకం, పాడైన పదార్థలను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో అధికారులు ఫ్యాక్టరీ యజమానులపై కేసు నమోదు చేసి ఫ్యాక్టరీని సీజ్ చేశారు.