డ్వాక్రా మహిళలకు ఆర్థిక దిశానిర్దేశం
VZM: డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్డీఏ వెలుగు పీడీ శ్రీనివాసపాణి సూచించారు. బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. డ్వాక్రా మహిళల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు.