VIDEO: 'ఇళ్లలోకి చేరిన వర్షం నీరు, ప్రజల ఇక్కట్లు'

KNR: జిల్లా కేంద్రంలో తెల్లవారుజామున వరకు కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముకురాంపుర మంకమ్మ తోట ప్రాంతాలలో ఇళ్లల్లోకి వర్షం నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి వర్షం నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.