'నేడు పన్ను బకాయిదారులు పన్ను చెల్లించవచ్చు'
గుంటూరు జిల్లాలో పన్ను చెల్లింపుల సౌలభ్యం కోసం, ఆదివారం సెలవు రోజున కూడా ప్రధాన, సర్కిల్ కార్యాలయాల్లో నగదు కౌంటర్లు తెరిచి ఉంటాయని మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.