బీజేపీ మోర్చా మహిళ అధ్యక్షురాలుకి ఘనంగా సత్కారం
SKLM: బీజేపీ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలిగా ఎన్నికైన పైడి సింధూరను ఎమ్మెల్యే గోండు శంకర్రావు అభినందించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమెకు ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో తనదైన భాగస్వామ్యాన్ని అందించాలని ఆమెను కోరారు. పార్టీ బలోపేతానికి, మహిళ సాధికారతకు కృషి చేయాలన్నారు.