VIDEO: ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని కంది పంట దగ్ధం

VIDEO: ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని కంది పంట దగ్ధం

ASF: తిర్యాణిలోని భీంపూర్ గ్రామంలో మంగళవారం అగ్నిప్రమాదంలో ఓ రైతు కష్టమంతా బుగ్గిపాలైంది. ఆత్రం మిత్రు తనకున్న 2 ఎకరాల్లో కంది సాగు చేశాడు. ఒక ఎకరా పంటను కోసి కుప్ప వేయగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. గాలివాటంతో మంటలు వేగంగా వ్యాపించి కుప్పతో పాటు చేనులో ఉన్న మిగతా పంట కూడా పూర్తిగా కాలి బూడిదైంది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు వేడుకున్నాడు.