అంబేద్కర్ కళాశాలను సందర్శించిన రాష్ట్ర అధికారి
శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడులో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కళాశాలను రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల డైరెక్టర్ పీఎంజే బాబు మంగళవారం సందర్శించారు. కలెక్టర్ మంజూరు చేసిన నిధులతో నిర్మాణం చేపట్టబోవు మరమ్మత్తు పనులు, నూతన భవనాలు నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఇందులో జిల్లా కోఆర్డినేటర్ పాల్గొన్నారు.