దేవగుడిపల్లె ఉత్సవాలకు శ్రీకాంత్ రెడ్డికి ఆహ్వానం

దేవగుడిపల్లె ఉత్సవాలకు శ్రీకాంత్ రెడ్డికి ఆహ్వానం

అన్నమయ్య: చిన్నమండెం మండలం దేవగుడిపల్లె గ్రామంలోని కొండమూల శ్రీ చౌడేశ్వరి దేవస్థానంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు జ్యోతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు రాయచోటి లోని వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని కలిసి ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు.