విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల సైకిళ్ల పంపిణీ

ELR: జిల్లాలో అర్హులైన ప్రతి విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందిస్తామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లో విభిన్న ప్రతిభావంతులు బొర్రా సుదాకరమ్మ, షేక్ ఇస్మాయిల్‌కు ట్రై చక్రాల సైకిళ్లను అందించారు. ఇద్దరు వయోవృద్ధులకు చేతి కర్రలను కలెక్టర్ పంపిణీ చేశారు. అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులు ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.