VIDEO: 24వ జాతీయ పారా అథ్లెటిక్స్‌లో.. దీప్తికి బంగారు పతకం
WGL: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2026లో వరంగల్ (D) పర్వతగిరి (M) కల్లెడకు చెందిన జీవంజి దీప్తి బంగారు పతకం సాధించారు. పరుగు పందెంలో (మహిళల విభాగం) 57.75 సెకన్ల సమయంలో నిర్ణీత దూరాన్ని అతి వేగంగా పూర్తి చేసి తొలి స్థానం దక్కించుకున్నారు. శనివారం జరిగిన పురస్కార వేడుకల్లో దీప్తికి బంగారు పతకాన్ని అందజేశారు.