బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి: కలెక్టర్

బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి: కలెక్టర్

NZB: గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ సన్నాహక ప్రక్రియలో భాగంగా 2002 ఓటర్ జాబితాలో ప్రస్తుత ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేయడం జరుగుతుందన్నారు.