VIDEO: రబీకి యూరియా కొరత ఉండదు: కలెక్టర్
E.G: రానున్న రబీ సీజన్‌లో రైతులకు యూరియా కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. నిన్న సాయంత్రం కలెక్టరేట్ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పలు అంశాలపై సమీక్షించారు. ఈ సీజన్‌కు తగినంత యూరియా నిల్వలను అందుబాటులో ఉంచామని కలెక్టర్ వెల్లడించారు.