'ఇసుక దందా చేయడానికే ప్రాజెక్ట్‌ను వాడుకున్నారు'
ASF: కాగజ్ నగర్ మండలంలోని జగన్నాథపూర్ గ్రామంలో BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ గురువారం పర్యటించారు. ఇప్పటివరకు జగన్నాథపూర్ ప్రాజెక్టు ఎందుకు పూర్తిచేయలేదని గత, ప్రస్తుత పాలకులను ప్రశ్నించారు. ప్రాజెక్టును ఇసుక దందా చేయడానికే వాడుకున్నారని ఆరోపించారు. సిర్పూర్ ప్రజలే తన కుటుంబ సభ్యులని, ఇక్కడి ప్రజల అభివృద్దే ముఖ్యమన్నారు.