హైదరాబాద్ - భువనేశ్వర్‌కు ప్రత్యేక రైళ్లు

VSP: దసరా, దీపావళి సందర్భంగా రద్దీని తగ్గించేందుకు దువ్వాడ మీదుగా హైదరాబాద్ - భువనేశ్వర్‌కు (07165/66) ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 28 వరకు ప్రతి మంగళవారం హైదరాబాద్లో బయలుదేరి భువనేశ్వర్ చేరుకుంటుంది. మరుసటి రోజు (బుధవారం) భువనేశ్వర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటుంది.