'మహిళా ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం'
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఎమ్మెల్యే విజయ రమణారావు సోమవారం పంపిణీ చేశారు. మహిళ ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య ద్వారా 13 మండలాల 9196 స్వశక్తి సంఘాలకు రూ.10,32,62,000 చెక్కులను పంపిణీ చేశారు.