వంద రోజులు గడిచినా వీడని 'మిస్టరీ'
KMM: చింతకాని మండలం పాతర్లపాడు CPM నేత సామినేని రామారావు హత్య కేసు 100రోజులు గడిచినా మిస్టరీగానే ఉంది. Dy. CM భట్టి నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికీ క్లూ సాధించలేకపోయారు. ఐదుగురు అనుమానితులకు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించినా ఫలితం దక్కలేదు. మరికొందరు పరీక్షలకు అంగీకరించకపోవడం దర్యాప్తునకు అడ్డంకిగా మారింది. నిందితులను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.