'చదువుతో పాటు నైతిక విలువలు పెంచుకోవాలి'
WG: విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు పెంచుకోవాలని పరీక్షల సహాయ కమిషనర్ సత్యనారాయణ సూచించారు. శుక్రవారం పెంటపాడు మండలం మీనవల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పదవ తరగతి పరీక్షల్లో అందరూ ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. నవంబర్ నెలాఖరు నాటికి సిలబస్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.