VIDEO: ఆ రోడ్డులో ప్రయాణం ప్రమాదకరం

AKP: రహదారుల్లో జంగిల్ క్లియరెన్స్ చేయించకపోవడం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కోటవురట్ల మండలంలోని లింగాపురం గ్రామం నుంచి కె.వెంకటాపురం వరకు రోడ్డుకి ఇరువైపులా పిచ్చి మొక్కలు వేపుగా పెరిగిపోయాయి. దీంతో రోడ్డు మలుపులో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి జంగిల్ క్లియరెన్స్ చేయాలని కోరుతున్నారు.