ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయం: ఎస్పీ

SRCL: తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయమని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు.