జైస్వాల్‌ను ఎందుకు పక్కన పెట్టారు?: మాజీ క్రికెటర్

ఆసియా కప్ భారత జట్టులోకి శుభమన్ గిల్‌ను తీసుకోవడం సరైన నిర్ణయమేనని మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ అన్నాడు. కానీ గిల్ కంటే అద్భుతంగా రాణిస్తున్న యశస్వి జైస్వాల్‌ను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించాడు. జైస్వాల్‌కు చోటు దక్కకపోవడం అన్యాయమని, అతని ఫామ్ దృష్ట్యా జట్టులో ఉండాల్సిందేనని బద్రీనాథ్ పేర్కొన్నాడు.