'విద్యార్థుల సంరక్షణపై నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు'
సత్యసాయి: రాబోయే టెన్త్, ఇంటర్ పరీక్షల్లో వంద శాతం ఫలితాలు రాబట్టాలని, ఇందుకోసం ఇప్పటి నుంచే విద్యార్థులను సమాయత్తం చేయాలని మంత్రి సవిత ఆదేశించారు. సోమవారం మంత్రి మాట్లాడుతూ.. ఫలితాలతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, సంరక్షణ ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థుల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.