ఆర్టీసీ బస్సు ఆటో ఢీ.. ఒకరు మృతి
VZM: కొత్తవలస మండలం ఆర్ధన్నపాలెం వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో వెనుక టైర్ పేలిపోవడంతో బస్సు ముందు భాగాన్ని ఆటో బలంగా ఢీ కొట్టిందన్నారు. ఈ ఘటనలో భీమాలి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఏ. పరదేశి (38) అక్కడే మృతి చెందాడు.