నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్
WNP: ఏదుల, రేవల్లి మండలాల్లో ఇవాళ కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాలను పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నూతన భవనాల్లో ఫర్నిచర్ ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.