అక్రమ లేఅవుట్‌లు.. ఇష్టారీతిలో రిజిస్ట్రేషన్‌లు
ADB: జిల్లాలో అనధికారిక లే అవుట్లకు రిజిస్ట్రేషన్ చేయరాదని 2020 ఆగస్టులోనే ఆదేశాలు చేసిన అమలు కావడం లేదు. దర్జాగా ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. గతంలో జరిగిన దస్తావేజులు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అంతర్గత విచారణ జరుపుతున్నారని సమాచారం. ఇటీవల మావల శివారు పరిధిలో కొన్ని లే అవుట్లలో ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి.