లతీఫ్ సాహెబ్ దర్గా వద్ద మజ్జిగ పంపిణీ
నల్గొండ పట్టణంలోని లతీఫ్ సాహెబ్ దర్గా వద్ద సామాజిక సేవకురాలు కంబాల శివ లీల ఆధ్వర్యంలో బుధవారం మజ్జిగ పంపిణీ చేశారు. కనగల్‌కు చెందిన ఎండీ అక్రమ్ ఆర్థిక సహకారంతో నల్గొండ లోని దర్గా దగ్గర బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ప్రతి ఏడు మాదిరిగానే ఈసారి కూడా పలుచోట్ల మజ్జిగ వితరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్రి శ్వేత పాల్గొన్నారు.