అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

WGL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను సాయంత్రానికి పూర్తి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులకు ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లా మొత్తంలో 79 శాతం సర్వే నమోదైందని, సర్వే పూర్తయిన గ్రామాల సిబ్బందిని సర్వే పూర్తికాని గ్రామాలకు పంపి సర్వేను వేగంగా చేపట్టి గురువారం సాయంత్రానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వంద శాతం పూర్తి చేయాలన్నారు.